Tuesday, 1 April 2008

నొప్పించక తనోవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి !!!!!!!!

హలో ఎలా న్నారు అంత...ఏమిటి తెలుగు లో రాస్తుఉనాను అనుకుంటున్నారా, చెప్పాను గా ముందే ఇలాంటిట్విస్ట్లు టర్న్ లు చాలా ఉంటాయని, మీరు తట్టుకోవలసిందే మరి. అదొక కారణం అయితె , నా మాతృ భాష మీద ఎంతమమకారము ఉంది అని , అందరి కి తెలుపుదాముఅని మాత్రం కాదు ఇంగ్లాండ్ లో ఉండి ఇంగ్లీష్ ని మరీ ఖునిచేసేస్తున్ననేమో అనిపించింది , అందుకని కొంత తెలుగు లో రాద్దాము అని డిసైడ్ అయ్యాను. మరి సుమతి శతకములోని చిన్న వాక్యము నా article subject , చిన్నప్పుడు టీచర్ కి అప్పచెప్పినట్టు గుర్తు ఉండే ఉంటుంది అందరికి.

సుమతి గారు ఎవరిని గురించి చెప్తూ పద్యం రాసారో గాని, మహానుభావుడిని కలిస్తే చాలా బాగా ఉంటుందిఅనిపిస్తుంది , ఆయన దగ్గర కొన్ని టిప్స్ తీసుకోవచ్చు. అసలు ప్రస్తుత సమాజములో ఇటువంటి వ్యక్తులు ఎవరైనాఉంటారా అనిపిస్తుంది. ఎవ్వరిని బాధపెట్టకుండా , తను బాధపడకుండా ఎవరైనా ఎలా ఉండగలరు ? కొంత మందిఇతరులను సంతోష పెట్టాలనే తాపత్రయం లో మన సంతోషం గురించి ఆలోచించారు, అలాంటి వారు కొందరైతే ; అసలుఎవరు ఏమైపోయిన తన స్వార్ధం చూసుకొనే వారు చాల మంది. నా అదృష్టము కొద్ది మొదటి కాటేగోరి వాళ్ళు , అలాగే నాదురదృష్టము కొద్ది రెండో కాటేగోరి వాళ్ళు నా లైఫ్ లో తారసపడటం జరిగింది.

నా లాస్ట్ ఆర్టికల్ లో చెప్పినట్లు నాకు
బద్ధకం, దానిని పూర్వం ఆలోచించటం లో కూడా ప్రదర్శించేదానిని , అందుకే నేనుసింపుల్ గా, సుమతి గారు చెప్పిన శతకాని తప్పుగా అర్థం చేసుకొన్నాను, దానికి నేను ఇచ్చిన నిర్వచనం "కంప్రొంమైస్స్కాని అది తప్పు అని చాలా లేట్ గా తెలుసుకొన్నాను. ప్రతిక్షణం వేరేవాళ్ళు నేను చేసిన పని వల్ల సంతోషపడుతున్నర లేదా, అని అలోచించేదాన్ని తప్ప; వాళ్ళు నేను చేసే పనులకి వేల్యూ ఇస్తున్నర లేదా అని కుడా ఆలోచించేదానిని కాదు. కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అలా చేస్తున్న చాలా సార్లూ నాకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సివచ్చింది. ఐతే నేను తరువాత గ్రహించిన విషయమేమిటంటే , పైన చెప్పిన మొదటి కాటేగోరి వాళ్ళు దానిని మంచితనంకింద లెక్క కడితే , రెండో కాటేగోరి వాళ్ళు చేతకానితనం కింద లెక్క గట్టారు; అధిఎలాగంటే మొదటి రకమేమోమనమంటే గౌరవము కాబట్టీ మనము చెప్పిన పనులు చేస్తున్నారు అనుకుంటే , రెండో వాళ్ళు- వాళ్ళకి ఏమి రాదుకనక మనము చెప్పినట్లు పడిఉంటున్నారు అని .

అప్పుడు అర్థం అయింది నాకు (చావు తెలివి మరీ) , మనుషులను గ్రహించి మసలుకోవటం అవసరమని, ఎవ్వరినిగుడ్డిగా నమ్మకూడదు అని, అలాగే మొదట సొంత అభిప్రాయాలను గౌరవించాలి అని; అంటే మన గురించే ఎంత సేపుఆలోచించమని కాదు కాని, కొంత అలోచించి మన అభిప్రాయాలూ వ్యక్తపరిస్తే ఏమో ఎదుట వారు కూడా నచ్చి దానికిఅంగీకరము తెలుపవచ్చు; వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ.

ఇందు మూలముగా నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, సుమతి గారు చెప్పినట్టు ఉండగలిగితే అంత కంటేఅదృష్టవంతులు లేరు, కాని అది పూర్తిగా నెరవేర్చ గలిగితేనే ; వన్ సైడ్ మాత్రం కాకూడదు. ఇంక చాలా రాయాలని ఉండికాని చాలా చాలా నిద్ర వస్తుంది కాబట్టీ మీరు అదృష్టవంతులు, ఇంతలోనే ఆపేస్తున్నాను.

సయోనార,
చిన్ని.

1 comment:

Sai said...

I just read all your articles.

Oh my goodness!!! You have very good writing skills. Your simple yet relevant thoughts and the way you are putting them on, are just awesome. I am going to keep checking this blog frequently now on.

Meeku telugulo koodaa manchi praaveenyatha vundi!!! Naaku thelisi mana aalochanalani oka paddathilo vraayatam antha sulabham kaadu. Choosaaraa... naaku koodaa telugu vachhaesthundi ippudu.

Anyway... nice sensible posts. Keep going!!!